ఏపీ మంత్రి నారా లోకేష్‌ కేసీఆర్‌, మోదీ మధ్య మైత్రి ఉన్నట్టుంది

 తెలంగాణ శాసనసభను రద్దు చేసిన కేసీఆర్‌, ఆంధ్రుల్ని ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదని ఏపీ మంత్రి నారా లోకేష్‌ వ్యాఖ్యానించారు. ఆంధ్రోళ్ల ఓట్లు వేయించుకుని గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్‌ తన పక్కన కూర్చో బెట్టుకున్నారని గుర్తుచేశారు. ఆంధ్రోళ్ల ఓట్లు వేయించుకోకుండానే జీహెచ్‌ఎంసీని తెరాస చేజిక్కించుకుందా? అని ప్రశ్నించారు. ఆయన శుక్రవారం ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. భాజపాకి, కేసీఆర్‌కి మధ్య రహస్య ఒప్పందం తాజా పరిణామాలతో స్పష్టంగా బోధపడుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని, భాజపాని దక్షిణ భారత రాష్ట్రాల్లోని ఇతర పార్టీలేవీ నమ్మడం లేదని, అందుకే కేసీఆర్‌తో ఆ పార్టీ మైత్రి కుదుర్చుకున్నట్టు కనిపిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొలువుదీరిన తొలి ప్రభుత్వం గడువు ముగియకముందే రద్దుకావడం బాధ కలిగించిందన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్‌... తెలంగాణలో తాము ఫలానా అభివృద్ధి చేశామని చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఏడాదిలో నిర్మించినన్ని ఇళ్లు కూడా తెలంగాణలో ప్రభుత్వం నిర్మించలేదన్నారు. ‘ముఖ్యమంత్రులకే సమయం ఇవ్వని ప్రధాని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. దాని అర్థమేంటి? కేసీఆర్‌ అంత నమ్మకంగా ఎన్నికల షెడ్యూల్‌ కూడా ప్రకటించడంలో మతలబేంటి? ఇవన్నీ చూస్తే వారి మధ్య రహస్య ఒప్పందం బోధపడుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ తెలంగాణకు ఎన్నికలు పది రోజుల్లో తేలుస్తాం

Thugs Of Hindostan - full movie | Amitabh Bachchan | Aamir Khan | ...

తెలంగాణ నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబరు మొదటి వారంలో ఎన్నికల ఫలితాలు ప్రకటించే అవకాశముంది. కేసీఆర్‌ telangana elections 2018 | kcr |