Posts

Showing posts with the label VIJAYAWADA

ఏపీ మంత్రి నారా లోకేష్‌ కేసీఆర్‌, మోదీ మధ్య మైత్రి ఉన్నట్టుంది

Image
 తెలంగాణ శాసనసభను రద్దు చేసిన కేసీఆర్‌, ఆంధ్రుల్ని ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదని ఏపీ మంత్రి నారా లోకేష్‌ వ్యాఖ్యానించారు. ఆంధ్రోళ్ల ఓట్లు వేయించుకుని గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్‌ తన పక్కన కూర్చో బెట్టుకున్నారని గుర్తుచేశారు. ఆంధ్రోళ్ల ఓట్లు వేయించుకోకుండానే జీహెచ్‌ఎంసీని తెరాస చేజిక్కించుకుందా? అని ప్రశ్నించారు. ఆయన శుక్రవారం ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. భాజపాకి, కేసీఆర్‌కి మధ్య రహస్య ఒప్పందం తాజా పరిణామాలతో స్పష్టంగా బోధపడుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని, భాజపాని దక్షిణ భారత రాష్ట్రాల్లోని ఇతర పార్టీలేవీ నమ్మడం లేదని, అందుకే కేసీఆర్‌తో ఆ పార్టీ మైత్రి కుదుర్చుకున్నట్టు కనిపిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొలువుదీరిన తొలి ప్రభుత్వం గడువు ముగియకముందే రద్దుకావడం బాధ కలిగించిందన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్‌... తెలంగాణలో తాము ఫలానా అభివృద్ధి చేశామని చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఏడాదిలో నిర్మించినన్ని ఇళ్లు కూడా తెలంగాణలో ప్రభుత్వం నిర్మించలేదన్నారు. ‘ముఖ్యమంత్రులకే సమయం ఇవ్వని ప్రధాని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కి అప...