కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ తెలంగాణకు ఎన్నికలు పది రోజుల్లో తేలుస్తాం

అంతా సిద్ధమైతే 4 రాష్ట్రాల కంటే ముందే తెలంగాణకు ఎన్నికలు రద్దయిన అసెంబ్లీకి తొలుత ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం రూలింగ్ ఉంది... ఎన్నికల షెడ్యూల్ గురించి కేసీఆర్ మాట్లాడటం సరికాదు అది పూర్తిగా ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశం ఎన్నికలకు సిద్ధమని తెలంగాణ సీఈవో నివేదిక పంపారు దాన్ని ఆడిట్ చేయడానికి బృందాన్ని పంపుతున్నాం ఓటర్ల జాబితా సమస్య కాదు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ నవంబరులో ఎన్నికలు, డిసెంబరులో ఫలితాలంటూ కేసీఆర్ మాట్లాడటం గర్హనీయం. వ్యక్తులు, రాజకీయ నాయకులు, భవిష్యవాణిల ప్రకారం ఎన్నికల సంఘం నడుచుకోదు. ఇలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ కమిషన్ సమర్ధించదు’ ఎన్నికల విషయమై కేసీఆర్ నన్నెప్పుడూ కలవలేదు. నాతో మాట్లాడనూ లేదు’ తొలుత సుప్రీం రూలింగ్‌ను, తర్వాత ఎన్నికల సన్నద్ధతను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ విషయంలో వారం పది రోజుల్లో ఓ నిర్ణయానికి వస్తాం. తెలంగాణ శాసనసభ అకస్మాత్తుగా రద్దయిన క్రమంలో.. సీఈవో ద్వారా నివేదిక తెప్పించుకుంటున్నాం. శాసనసభ అర్ధంతరంగా రద్దయినప్పుడు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని 2002లో సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిందన...