తెలంగాణ నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబరు మొదటి వారంలో ఎన్నికల ఫలితాలు ప్రకటించే అవకాశముంది. కేసీఆర్‌ telangana elections 2018 | kcr |

నవంబరులోనే తెలంగాణ ఎన్నికలు: కేసీఆర్‌
డిసెంబర్‌ మొదటి వారంలో ఫలితాలు
 నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగుతాయని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. అక్టోబర్‌లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నవంబర్‌లో ముగుస్తాయని వెల్లడించారు. ‘‘తెరాస అధ్యక్షుడి హోదాలో హుస్నాబాద్‌ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నాం. మీ అందరకీ తెలుసు మంచి సమయంలో చేస్తే అంతా మంచిగా ఉంటుంది. చెడ్డ సమయంలో చెడ్డగానే ఉంటుంది. 9న అమావాస్య వస్తున్నది. 7వ తేదీ శ్రావణమాసం శుక్రవారం ప్రశస్తమైన రోజు. ఒక సభ కూడా ప్రారంభించుకుంటున్నాం. తర్వాత పితృపక్షాలు వస్తున్నాయి.. అవి మంచి రోజుల కింద పరిగణించరు. కాబట్టి ఈ కార్యక్రమం అంతా ముగించుకోవాలి.

ఎన్నికలు కూడా వీలైనంత తొందరగా వచ్చే ఆస్కారముంది. మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి. అంత గందరగోళం అవసరం లేదు. రాజ్యాంగం ప్రకారం కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి. వీలైనంత తొందరలో నిర్వహించాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌లు అనేకం ఉన్నాయి. ఎవరికీ గందరగోళం అవసరం లేదు. నాకున్న పరిజ్ఞానం మేరకు అక్టోబర్‌ మొదటి వారంలో ఎన్నికల ప్రక్రియ మొదలై నోటిఫికేషన్‌ వస్తుంది..
నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబరు మొదటి వారంలో ఎన్నికల ఫలితాలు ప్రకటించే అవకాశముంది. మీడియా చాలా ప్రయత్నాలు చేసింది కానీ కొన్ని విషయాలు తెలియనీయలేదు. నేను స్వయంగా కేంద్ర ముఖ్య ఎన్నికల అధికారితో, మిగతా ఇద్దరు కమిషనర్లతో మాట్లాడాను. ఆషామాషీగా చేయరు కదా. సీఎస్‌ ఎస్‌.కె.జోషి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ కూడా మాట్లాడారు. అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంసిద్ధత కూడా తెలియజేశాం. పద్ధతి ప్రకారం అన్ని ఏర్పాట్లూ చేశాం. అభ్యర్థులు కూడా ఎవరి పని వాళ్లు చేసుకుంటే మంచిది. మాకున్న కచ్చితమైన సమాచారం మేరకు నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగుతాయి. మూడు రాష్ట్రాల్లో ఒక విడత పోలింగ్‌ ఉంటుంది, మధ్యప్రదేశ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్‌ ఉంటుంది’’ అని కేసీఆర్‌ అన్నారు.

Comments

Popular posts from this blog

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ తెలంగాణకు ఎన్నికలు పది రోజుల్లో తేలుస్తాం

Thugs Of Hindostan - full movie | Amitabh Bachchan | Aamir Khan | ...