Posts

Showing posts from September, 2018

ఏపీ మంత్రి నారా లోకేష్‌ కేసీఆర్‌, మోదీ మధ్య మైత్రి ఉన్నట్టుంది

Image
 తెలంగాణ శాసనసభను రద్దు చేసిన కేసీఆర్‌, ఆంధ్రుల్ని ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదని ఏపీ మంత్రి నారా లోకేష్‌ వ్యాఖ్యానించారు. ఆంధ్రోళ్ల ఓట్లు వేయించుకుని గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్‌ తన పక్కన కూర్చో బెట్టుకున్నారని గుర్తుచేశారు. ఆంధ్రోళ్ల ఓట్లు వేయించుకోకుండానే జీహెచ్‌ఎంసీని తెరాస చేజిక్కించుకుందా? అని ప్రశ్నించారు. ఆయన శుక్రవారం ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. భాజపాకి, కేసీఆర్‌కి మధ్య రహస్య ఒప్పందం తాజా పరిణామాలతో స్పష్టంగా బోధపడుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని, భాజపాని దక్షిణ భారత రాష్ట్రాల్లోని ఇతర పార్టీలేవీ నమ్మడం లేదని, అందుకే కేసీఆర్‌తో ఆ పార్టీ మైత్రి కుదుర్చుకున్నట్టు కనిపిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొలువుదీరిన తొలి ప్రభుత్వం గడువు ముగియకముందే రద్దుకావడం బాధ కలిగించిందన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్‌... తెలంగాణలో తాము ఫలానా అభివృద్ధి చేశామని చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఏడాదిలో నిర్మించినన్ని ఇళ్లు కూడా తెలంగాణలో ప్రభుత్వం నిర్మించలేదన్నారు. ‘ముఖ్యమంత్రులకే సమయం ఇవ్వని ప్రధాని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కి అప...

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ తెలంగాణకు ఎన్నికలు పది రోజుల్లో తేలుస్తాం

Image
అంతా సిద్ధమైతే 4 రాష్ట్రాల కంటే ముందే తెలంగాణకు ఎన్నికలు రద్దయిన అసెంబ్లీకి తొలుత ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం రూలింగ్‌ ఉంది... ఎన్నికల షెడ్యూల్‌ గురించి కేసీఆర్‌ మాట్లాడటం సరికాదు అది పూర్తిగా ఎన్నికల కమిషన్‌ పరిధిలోని అంశం ఎన్నికలకు సిద్ధమని తెలంగాణ సీఈవో నివేదిక పంపారు దాన్ని ఆడిట్‌ చేయడానికి బృందాన్ని పంపుతున్నాం ఓటర్ల జాబితా సమస్య కాదు  కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ నవంబరులో ఎన్నికలు, డిసెంబరులో ఫలితాలంటూ కేసీఆర్‌ మాట్లాడటం గర్హనీయం. వ్యక్తులు, రాజకీయ నాయకులు, భవిష్యవాణిల ప్రకారం ఎన్నికల సంఘం నడుచుకోదు. ఇలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ కమిషన్‌ సమర్ధించదు’ ఎన్నికల విషయమై కేసీఆర్‌ నన్నెప్పుడూ కలవలేదు. నాతో మాట్లాడనూ లేదు’ తొలుత సుప్రీం రూలింగ్‌ను, తర్వాత ఎన్నికల సన్నద్ధతను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ విషయంలో వారం పది రోజుల్లో ఓ నిర్ణయానికి వస్తాం. తెలంగాణ శాసనసభ అకస్మాత్తుగా రద్దయిన క్రమంలో.. సీఈవో ద్వారా నివేదిక తెప్పించుకుంటున్నాం. శాసనసభ అర్ధంతరంగా రద్దయినప్పుడు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని 2002లో సుప్రీంకోర్టు రూలింగ్‌ ఇచ్చిందన...

తెలంగాణ నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబరు మొదటి వారంలో ఎన్నికల ఫలితాలు ప్రకటించే అవకాశముంది. కేసీఆర్‌ telangana elections 2018 | kcr |

Image
నవంబరులోనే తెలంగాణ ఎన్నికలు: కేసీఆర్‌ డిసెంబర్‌ మొదటి వారంలో ఫలితాలు  నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగుతాయని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. అక్టోబర్‌లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నవంబర్‌లో ముగుస్తాయని వెల్లడించారు. ‘‘తెరాస అధ్యక్షుడి హోదాలో హుస్నాబాద్‌ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నాం. మీ అందరకీ తెలుసు మంచి సమయంలో చేస్తే అంతా మంచిగా ఉంటుంది. చెడ్డ సమయంలో చెడ్డగానే ఉంటుంది. 9న అమావాస్య వస్తున్నది. 7వ తేదీ శ్రావణమాసం శుక్రవారం ప్రశస్తమైన రోజు. ఒక సభ కూడా ప్రారంభించుకుంటున్నాం. తర్వాత పితృపక్షాలు వస్తున్నాయి.. అవి మంచి రోజుల కింద పరిగణించరు. కాబట్టి ఈ కార్యక్రమం అంతా ముగించుకోవాలి. ఎన్నికలు కూడా వీలైనంత తొందరగా వచ్చే ఆస్కారముంది. మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి. అంత గందరగోళం అవసరం లేదు. రాజ్యాంగం ప్రకారం కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి. వీలైనంత తొందరలో నిర్వహించాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌లు అనేకం ఉన్నాయి. ఎవరికీ గందరగోళం అవసరం లేదు. నాకున్న పరిజ్ఞానం మేరకు అక్టోబర్‌ మొదటి వారంలో ఎన్నికల ప్రక్రియ మొదలై నోటిఫికేషన్‌ వస్తుంది.. ...